“తండ్రి ప్రేమకు ఇదే నిదర్శనం… బిడ్డను ఎత్తుకునేటప్పుడు ఆ నాన్న కంగారు! 👶❤️”

బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అయితే.. ఆ చిన్నారి రాక తండ్రికి సరికొత్త ఫీలింగ్..! తొలిసారి బిడ్డను చేతుల్లోకి తీసుకునేటప్పుడు ఆ తండ్రి పొందే అనుభూతి అనిర్వచనీయం. అప్పటివరకు అలవాటు లేకపోవడం వల్ల ఆ మధుర క్షణాల్లో ఏ తండ్రికైనా ఒకింత కంగారు తప్పదు. అలాంటి ఓ నాన్న భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు చెన్నైకి చెందిన ఓ డాక్టర్. అప్పుడే పుట్టిన బిడ్డను లేబర్ రూమ్ బయట వేచిఉన్న తండ్రికి చూపించడానికి వైద్యురాలు బయటకు తీసుకువచ్చారు. ఇదిగో మీ బిడ్డ అంటూ.. పసికందును ఇస్తుండగా చేతుల్లోకి తీసుకోవడానికి ఆ తండ్రి ఎంతో కంగారుపడ్డాడు. ఎలా ఎత్తుకుంటే ఏమవుతుందోనని భయపడుతున్న అతడికి సర్దిచెప్పి.. డాక్టర్ బిడ్డను చేతిలో పెట్టారు. తన ప్రతిరూపాన్ని మొదటిసారి చూసిన ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియో నెటిజన్ల మనసులను మెప్పిస్తోంది. తండ్రి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 20 కోట్ల వ్యూస్ వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *