“ఇరాన్ భారీ నిర్ణయం! కొత్త సుప్రీమ్ లీడర్ ఎవరు? ప్రపంచం టెన్షన్లో 😱”
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, అయితే పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై కనీసం ఆరు నెలలు తీవ్రమైన యుద్ధాన్ని కొనసాగించగలమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు.
ఇక గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు సమాచారం. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని డిప్లొమాటిక్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్‌ను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను కూడా డ్రోన్లు టార్గెట్ చేశాయని చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మినాబ్‌లోని ఒక పాఠశాలపై జరిగిన ఘోర దాడికి ఇరాన్‌నే బాధ్యుడిగా ఆరోపించారు. ఆ దాడిలో కనీసం 150 మంది మృతి చెందినట్లు సమాచారం.
