🔥 “S Saraswathi Movie Review: ట్విస్ట్ కోసం వెయిట్ చేసిన ప్రేక్షకులకు షాక్!”

“వరలక్ష్మి శరత్‌కుమార్ ‘S Saraswathi’ సినిమా వచ్చేసింది… కానీ ఇది థ్రిల్లరా? లేక బోర్ ఫిల్లరా? 😲” “ఈ సినిమాలో లక్ష్మి అనే నర్స్ తన కూతురు సరస్వతి కోసం వెతుకుతూ చేసే పోరాటం చూపించారు. స్కూల్ నుంచి కూతురు మిస్సింగ్… కానీ స్కూల్ వాళ్లు ‘అలాంటి స్టూడెంట్ లేరు’ అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక రివెంజ్ స్టోరీ.” “ఇంటర్వల్ తర్వాత ఫ్లాష్‌బ్యాక్, చివర్లో పెద్ద పెద్ద డైలాగ్‌లు… కానీ కథ మాత్రం చాలా ప్రిడిక్టబుల్. థ్రిల్లర్ అనిపించాల్సిన సినిమా కొంచెం స్లోగా ఫీల్ అవుతుంది.” “మెసేజ్ మాత్రం స్ట్రాంగ్ – మహిళల భద్రత గురించి. కానీ కథ చెప్పే విధానం కొత్తగా అనిపించదు.” ఒక రివ్యు మీద డిపెండ్ అవటం కరెక్ట్ కాదు మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయడం గురు 

“ఇరాన్ భారీ నిర్ణయం! కొత్త సుప్రీమ్ లీడర్ ఎవరు? ప్రపంచం టెన్షన్‌లో 😱”

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, అయితే పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై కనీసం ఆరు నెలలు తీవ్రమైన యుద్ధాన్ని కొనసాగించగలమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు.

ఇక గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు సమాచారం. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని డిప్లొమాటిక్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్‌ను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను కూడా డ్రోన్లు టార్గెట్ చేశాయని చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మినాబ్‌లోని ఒక పాఠశాలపై జరిగిన ఘోర దాడికి ఇరాన్‌నే బాధ్యుడిగా ఆరోపించారు. ఆ దాడిలో కనీసం 150 మంది మృతి చెందినట్లు సమాచారం.

“అమ్మ ప్రేమకు సాటిలేదు ❤️ | తల్లి గొప్పతనం తెలిపే హృదయాన్ని కదిలించే కవిత”

ఓ స్త్రీ నీ నవమాసాల గర్భగుడి నుదిటి రాతను మార్చే జ్ఞానగుడి ప్రపంచపు రంగస్థలంపై మన పాత్రకు ఒరవడి తల్లి పాల అమృత్తాన్ని తాగించి మమతాను రాగాలు రంగరించి గోరుముద్దలు తినిపించి వేలు పట్టి నడిపించి సంస్కృతి సంప్రదాయాలను మేళవించి నిన్ను నిన్నుగా ఈ లోకానికి పరిచయం చేసి నీ జీవిత యాత్రలో తాను ఓ చుక్కాని యై అడుగడుగునా అవమానాలు, మోసాలు భరిస్తూ మోముపై చెరగని చిరునవ్వుతో నిత్యం అగుపిస్తూ ఈ ప్రపంచంలో కల్తీలేని నిస్వార్ధ జీవిస్త్రీ…అమ్మలా …! ఆరని జ్యోతిలా వెలుగుతూ ఆశలు ఆవిరైనా అంతరంగమందు అందమైన జ్ఞాపకంలా అవనిలో వెలిసిన ఆణిముత్యం ఈ స్త్రీ మూర్తి..! లాలించి పాలించు ముక్కంటిలో సగమైన ఆది పరాశక్తి అందరికీ ఆమెయే నిజమైన స్ఫూర్తి… ఈ అనురాగ మూర్తి!